సౌదీ అరేబియా సౌదీ రిటైల్‌ రంగంలో 200,000 మంది మహిళలు

- September 08, 2017 , by Maagulf
సౌదీ అరేబియా సౌదీ రిటైల్‌ రంగంలో 200,000 మంది మహిళలు

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ డెవలప్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం రిటైల్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికుల సంఖ్య 200,000 అని తెలియవస్తోంది. విమెన్స్‌ ఎంప్లాయ్‌మెంట్‌ పాలసీ అండ్‌ ప్రోగ్రామ్స్‌ - లేబర్‌ మినిస్ట్రీ హెడ్‌ ఫతెన్‌ అల్‌ సైరి మాట్లాడుతూ, మహిళా కార్మికులకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టేషన్‌ సమస్యను తగ్గించేందుకు మినిస్ట్రీ యత్నిస్తోందని చెప్పారు. ఉబెర్‌ కరీమ్‌ కార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలను వినియోగించుకునేందుకు 400 వోచర్లను పంపిణీ చేశారు. 2020 నాటికి ఈ విధానం ద్వారా లబ్ది పొందే మహిళల సంఖ్యను 150,000కి చేర్చాలనే ఆలోచనతో ఉన్నామని ఫెతన్‌ అల్‌ సారి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com