జక్కన్న మాట నమ్మి మోసపోయాం అంటున్న సినీ జనాలు
- September 10, 2017
'బాహుబలి' సిరీస్‌తో నేషనల్ లెవెల్లో రాజమౌళి సెలెబ్రిటీ అయిపోయాడు. సినీ లవర్స్ అందరూ ఆయన తరువాతి మూవీ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నెక్స్ట్ మూవీ విషయంలో జక్కన్న నుండి క్లారిటీ రాలేదు. 'బాహుబలి' కోసం ఐదు సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన.. ఇప్పుడు రిఫ్రెష్ అవుతున్నాడు. పనిలో పనిగా ఈ గ్యాప్‌లో తన ఫ్యామిలీ ఫ్రెండ్ సాయి కొర్రపాటి సినిమాలని ప్రమోట్ చేస్తున్నాడు.
రిలీజ్‌కి ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన జగపతిబాబు 'పటేల్ సర్' మూవీని రాజమౌళి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. రిలీజ్ తరువాత ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఇక రీసెంట్‌గా నాగ చైతన్య 'యుద్ధం శరణం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ 'తన స్టోరీలలో కూడా లోపాలు చూపే తన భార్య రమకి 'యుద్ధం శరణం' స్టొరీ బాగా నచ్చేసిందని' చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు. కానీ.. రిలీజ్ తరువాత ఆ మూవీకి స్టొరీనే మైనస్ అనే టాక్ వచ్చి ఫ్లాప్ అయింది. దాంతో రాజమౌళి మాటలని నమ్మి ఇకపై సినిమాకి వెళ్ళకూడదనేది సినీ జనాల మాట.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









