కల్బాలోని అన్ని రోడ్లకీ కొత్త స్పీడ్ లిమిట్
- September 10, 2017
షార్జాలోని కల్బా సిటీలో అన్ని రోడ్లకీ కొత్త స్పీడ్ లిమిట్ ప్రకటించారు అధికారులు. ఈ స్పీడ్ లిమిట్‌ని గంటకు 80 కిలోమీటర్లుగా గుర్తించారు. దీంతోపాటుగా గ్రేస్ స్పీడ్ మరో 20 కిలోమీటర్లు (యూఏఈ పరిమితులకు లోబడి). అన్ని రోడ్లపైనా రాడార్లు, ఈ 100 కిలోమీటర్ల స్పీడ్ దాటితే వాహనదారుల్ని గుర్తిస్తాయి. వాడి అల్ హెలు సహా పలు ముఖ్యమైన రోడ్లపై ఈ స్పీడ్ లిమిట్‌ని అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ (ఈస్టర్న్ రీజియన్ పోలీస్ స్టేషన్) లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ యమాహి చెప్పారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, వాహనదారులు సైతం ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. తాము చేపడుతున్న చర్యల కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







