భాగ్యనగరాన్ని వణికిస్తున్న డెంగ్యూ
- September 11, 2017
డెంగ్యూ... ఈపేరు వినగానే వణుకుపుడుతోంది. శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. సకాలంలో స్పందించకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదమూ ఉంది. కొన్నిరోజులుగా హైదరాబాద్ ఆస్పత్రుల్లో డెంగ్యూ లక్షణాలతో చేరుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
డెంగ్యూ...ఈ వ్యాధి రావడానికి ఆర్బోవైరసం జాతికి చెందిన వైరస్ కారణం. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్ట్ జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. ఈ దోమే టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడతాయి. దోమలు కుట్టిన తర్వాత 5 నుంచి 8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ సోకినప్పుడు ఉన్నట్టుండి జ్వరం అధికంగా రావడం, తలనొప్పి ఎక్కువగా ఉండటం, కంట్లో నొప్పి, కండరాళ్లు, కీళ్లనొప్పులు, వాంతి అవుతున్నట్లు అనిపించడం నోరెండిపోవడం జరుగుతుంది.
ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి డెంగ్యూ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలి. ఈ దోమలు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఎయిర్ కూలర్లు, పూల కుండీల కింద గల సాసర్లు, బయటపెట్టిన టైర్లు, మూతలు పెట్టిన, నీరు నిల్వచేసే తొట్టెలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాలీ డ్రమ్ములు, సన్ షేడ్స్‌పై నిలిచిన వాన నీరు, బిల్డింగ్‌లపై నిలిచిన వాన నీటితో ఎక్కువగా పెరుగుతాయి. డెంగ్యూకు సంబంధించి ఏ చిన్న లక్షణం కనిపించినా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.
వచ్చాక హడావుడి పడేకన్నా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని డెంగ్యూ రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగ్యూతో రోజుకు కనీసం ఐదుగురు పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నారని పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







