పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రేమికులను పరువు కోసం హత్య చేశారు
- September 12, 2017
ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయిన ప్రేమికులను పరువు కోసం హత్య చేశారు తల్లిదండ్రులు. అత్యంత కిరాతకంగా గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్ పెట్టి ప్రేమికులను చంపేశారు.
పాకిస్థాన్‌లోని కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ కూడ తమ ఇళ్ళ నుండి గత మాసంలో పారిపోయారు.
అయితే రెండు కుటుంబసభ్యులు ప్రేమికులు వారిని తీసుకువచ్చారు.జిర్గా కుల పెద్దలు ప్రేమికులను చంపాలని తీర్మాణం చేసింది. మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్ పెట్టి చంపాలని గ్రామపెద్దలు తీర్మాణం చేశారు. కుల పరువును తీసినందుకు కుల పెద్దలు ఈ మేరకు ఆదేశించారు.
మొదటి రోజు అమ్మాయిని, రెండోరోజు అబ్బాయిని చంపేశారు. ప్రేమికుల పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినప్పటికీ కూడ కుల పెద్దలు మాత్రం అంగీకారం తెలపకపోవడంతో మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్‌తో చంపేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందామనుకున్న ఓ యువజంట(అమ్మాయికి 15, అబ్బాయికి 17)ను ఇరు కుటుంబాల సభ్యులు కళ్లముందే అతి దారుణంగా చంపేశారు. కుటుంబం పరువు తీశారని కళ్లెర్రజేస్తూ వారిద్దరిని నులక మంచానికి కట్టిపడేసి కరెంట్ షాక్ పెట్టి చంపారు. ఈ దృశ్యాన్ని ఊరంతా కూడా తిలకిస్తూ ఏ మాత్రం మానవత్వం లేనివారిగా వ్యవహరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
కానీ, వారిని పట్టి బందించి తీసుకొచ్చాక ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపే జిర్గా అనే కులపెద్దల సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. వారిద్దరు కుల పరువు తీశారని వారిని మంచానికి కట్టిపడేసి చంపేయాలని ఆదేశించడంతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ రెండు కుటుంబాల ముందే మంచానికి కట్టిపడేసి కరెంట్ షాక్ పెట్టి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాలకు చెందిన వారిని, కుల పెద్దలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
తొలి రోజు అమ్మాయిని, రెండో రోజు అబ్బాయిని ఇలా చంపి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ జంట తల్లిదండ్రులు ఒక ఒప్పందానికి వచ్చినా జిర్గా సంఘం అంగీకరించకపోవడంతో ఈ పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. జిర్గా సంఘం ప్రభుత్వ చట్టాలకంటే కఠినంగా పనిచేస్తుందని, ఆ ప్రజలు కూడా చట్టాలకంటే జిర్గా పెద్దల మాటలే పట్టించుకుంటారని తెలిపారు. ప్రతి ఏటా పరువు హత్యల్లో 500మంది పాకిస్థాన్ మహిళలు బలవుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







