బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం

- September 12, 2017 , by Maagulf
బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై 13 గంటల చర్చ జరిగింది. అనుకూలంగా 326, వ్యతిరేకంగా 290 ఓట్లు వచ్చాయి. ఐరోపా సమాఖ్యలో బ్రిటన్‌ చేరికకు ఉద్దేశించిన 1972 చట్టాన్ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం 12వేల ఈయూ నిబంధనలను బ్రిటన్‌ చట్టాల సంపుటికి బదలాయించే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గతేడాది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చిన తర్వాత ఆ దిశగా తీసుకున్న తదుపరి చర్య ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com