మహి.వి.రాఘవకు రూ. 7 కోట్ల లాస్

- September 12, 2017 , by Maagulf
మహి.వి.రాఘవకు రూ. 7 కోట్ల లాస్

టైటిల్ చూసి అదేంటి 'ఆనందో బ్రహ్మ' సినిమా హిట్ అయ్యింది కదా ఆ డైరెక్టర్ కు లాస్ రావడమేంటి అని అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ మొత్తం చూడాల్సిందే..'ఆనందో బ్రహ్మ' ను డైరెక్టర్ చేసిన మహి.వి.రాఘవ ఎంబీఏ చేసి కొన్నేళ్లు ఉద్యోగం చేయడంతో పాటు బిజినెస్ కూడా చేసి బాగానే వెనకేసుకున్నాడు. ఐతే సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ముందు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడట. 'విలేజ్ లో వినాయకుడు'.. 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలను నిర్మించాడు. ఈ రెండూ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ రెండిటి వల్ల డబ్బులు పోయాయి.
ఆ తర్వాత మహి.. స్వీయ దర్శకత్వంలో 'పాఠశాల' అనే సినిమాను నిర్మించాడు. సినిమా బాగా తీసాడు , సినిమా బాగుందని టాక్ వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదట. దీంతో ఈ మూడింటి వల్ల దాదాపు రూ. 7 కోట్ల మేర డబ్బులు పోగొట్టుకున్నాడట. ఇక నిర్మాణ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యి 'ఆనందో బ్రహ్మ' ను కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కించి , దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ షేర్ రూ.10 కోట్ల దాకా వచ్చింది. శాటిలైట్ హక్కులు.. రీమేక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపితే.. ఈ సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్ల ఆదాయం ఆర్జించినట్లన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com