ఇంటర్ విద్యార్థి చాందినిని హత్య చేసినది ప్రియుడే

- September 12, 2017 , by Maagulf
ఇంటర్ విద్యార్థి చాందినిని హత్య చేసినది ప్రియుడే

చాందిని జైన్ కేసు మిస్టరీ వీడింది. ప్రేమికుడు సాయి కిరణ్‌ రెడ్డిని హంతకుడిగా తేల్చారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే ఆమెను అంతం చేసినట్టు స్పష్టమైంది. 9వ తేదీ సాయంత్రం సాయికిరణ్‌ నుంచి చాందినికి ఫోన్ వచ్చింది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. తను రాగానే అమీన్‌పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ లవ్ మేటర్ విషయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. తనను వదిలించుకునేందుకు సాయికిరణ్ ట్రై చేయడాన్ని గట్టిగా నిలదీసింది. అప్పుడు జరిగిన ఘర్షణలో గొంతు నులిమి అమ్మాయిని చంపేశాడు. ఐతే, ఇలా హత్య చేయడం ఒక్కడి వల్లా కాదని, మరో ఇద్దరు అప్పుడు అక్కడే ఉండి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. 
చాందిని వాళ్లు ఉంటే అపార్ట్‌మెంట్‌కి దగ్గర్లోనే ప్రగతి ఎన్‌క్లేవ్‌లో సాయి కిరణ్‌ రెడ్డి ఉంటాడు. అతను క్లాస్‌మేటే. ఇతని నంబర్‌నే మై హార్ట్ పేరుతో చాందిన తన మొబైల్‌లో సేవ్ చేసుకుంది. 9వ తేదీ ఆ నంబర్ నుంచి ఫోన్ రాగానే, ఫ్రెండ్‌ని కలిసి వస్తానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చింది. తర్వాత ఆటోలో ఇద్దరూ అమీన్‌పూర్ గుట్టవైపు వెపు వెళ్లారు. అక్కడే చాందినిని చంపేశాడు. చాందిని వాట్సప్ మెసేజ్‌లు, కాల్‌డేటా విశ్లేషించాక నిన్న సాయంత్రమే సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా జరిగిందంతా తెలిసాక అతనే హంతకుడిగా నిర్థారించారు. 
చాందిని మర్డర్ కేసు విషయంలో ఆటో డ్రైవర్ కూడా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అతనిచ్చిన సమాచారం ఆధారంగానే వాళ్లు ఆటో ఎక్కడ దిగారు అన్న వివరాలు తెలిసాయి. అక్కడి CC ఫుటేజ్‌ బయటకు వచ్చింది. ఆటో డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం వాళ్లిద్దరే అక్కడకు వచ్చారు. ఐతే, అప్పటికే అక్కడ సాయి కిరణ్ స్నేహితులు ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ చేశాక వాళ్లంతా వేరే వైపు నుంచి పారిపోయి ఉంటారని చెప్తున్నారు. 
ఇంటర్‌మీడియట్ చదువుతున్న సాయికిరణ్‌ రెడ్డి ఇలా హత్య చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కుర్రాడికి గంజాయి అలవాటు ఉన్నట్టు కూడా పోలీసు విచారణలో తేలింది. తరచుగా ఫ్రెండ్స్‌తో కలిసి అమీర్‌పూర్‌ గుట్టల్లోకి వెళ్తుంటాడు. అక్కడ మద్యం తాగుతారు, గంజాయి సిగరెట్లు కాలుస్తారు. కొన్నిసార్లు ఈ పార్టీలకు చాందినిని కూడా తీసుకెళ్లేవాడు. వీరిద్దరూ ప్రైవేట్‌గా కూడా ఇక్కడకు వచ్చినట్టు సాయికిరణ్ విచారణలో ఒప్పుకున్నాడు. ఇంటర్‌మీడియట్ స్థాయిలోనే సాయి కిరణ్ బ్యాచ్ మత్తుమందుకు బానిసలయ్యారన్న విషయం షాకింగ్‌ న్యూస్ అయ్యింది. 
నిన్న క్లాస్‌మేట్స్‌ను విచారించిన సందర్భంలో కొందరు ఫ్రెండ్స్ కీలక సమాచారం ఇచ్చారు. కొద్ది వారాలుగా చాందిని ముభావంగా ఉంటోందని, ఆమెలో టెన్షన్ కనిపిస్తోందని చెప్పారు సాయికిరణ్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా తమకు తెలియదని, వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని మాత్రమే అనుకున్నామన్నారు. ఐతే, చాందిని కాల్ డేటా ప్రకారం చూస్తే సాయిని చాలా ఇష్టపడింది. మొబైల్‌లో పేరు కూడా మైహార్ట్ అని సేవ్ చేసుకుంది. ఐతే, కొద్దిరోజులుగా సాయికిరణ్ దూరం పెడుతుండడంతో తట్టుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై గొడవ పడడం ఆమె ప్రాణం తీసే వరకూ వెళ్లినట్టు కనిపిస్తోంది.
క్లాస్‌మేటే చాందినిని చంపేశాడన్న విషయం తెలిసి పేరెంట్స్ షాక్‌కి గురయ్యారు. కూతురినీ కోల్పోయిన బాధలో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. చాందిని చాలా మంచి అమ్మాయిని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని చెప్తున్నారు. తను ఎవరినో ప్రేమిస్తున్నట్టు తమకు తెలియదని, తాము ఈ వ్యవహారాన్ని గమనించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
సాయి కిరణ్ ఈ హత్య చేశాడా లేదంటే తెలిసిన  బ్యాచ్‌కు సుపారీ ఇచ్చి ఇందుకు పురమాయించాడా అన్నది కూడా  విచారణలో  తేలుతుందంటున్నారు పోలీసులు. మైనర్లైన వీళ్దిదరూ గొడవపడ్డారని అనుకున్నా, గొంతు నులిమి చంపడం ఒక్కరివల్ల సాధ్యం కాదంటున్నారు. సాయి కిరణ్‌కు ఇంకెవరో సపోర్ట్ చేశారని భావిస్తున్నారు. నిన్న పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసినప్పుడే ఆమె గొంతు నులిమి చంపినట్టు తేలింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com