లిఫ్టులలో మానవ ప్రమేయంతో తీసే తలుపులను నిషేధించాలనే ప్రణాళిక లేదు

- September 13, 2017 , by Maagulf
లిఫ్టులలో మానవ ప్రమేయంతో తీసే తలుపులను నిషేధించాలనే ప్రణాళిక లేదు

కువైట్ : కొన్నిరకాల ఎలివేటర్లలో సాధారణ తలుపుల విధానం కువైట్ లో నిషేధించాలనే ప్రణాళిక తమకు ఏమీ లేదని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) స్పష్టం చేసింది. దీని ప్రకారం, అన్ని ఎలివేటర్లను ప్రజల   సౌలభ్యం కోసం లైసెన్స్ జారీ చేసే ముందు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ చేత క్షుణ్ణంగా తనిఖీ చేయబడతాయి   ఇటీవల  సోషల్ మీడియాలో కొన్ని వదంతులకు విస్తరిస్తున్న నేపథ్యంలో కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్   ప్రతిస్పందించింది. వినియోగదారుల భద్రత కోసం కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ చేత సర్టిఫికేట్ చేసిన లిఫ్టులు నిర్వహణ సంస్థలతో నిర్వహణ ఒప్పందాల సంతకం చేసేందుకు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఆయా ఆస్తి యజమానులను ఆదేశిస్తుంది. కొంతమంది లిఫ్టులు ఆటోమేటిక్ తలుపులు కలిగి ఉండగా, ఇతరులు సెమీ ఆటోమేటిక్ తలుపులు ( కొద్దిగా మానవ ప్రమేయంతో తీసేవి) కలిగి ఉంటారని అధికారులు వివరించారు. క్రమం తప్పకుండా కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ చేత తనిఖీ చేయబడతాయి. మానవ ప్రమేయంతో తీసే తలుపులను కల్గి ఉన్నలిఫ్టులు తొలగించడానికి కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఎటువంటి ఉత్తర్వు జారీ చేయలేదని అధికారికంగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com