యూఏఈ మంటల్ని ఆర్పిన ఫైర్ ఫైటర్స్: కార్మికులు క్షేమం
- September 13, 2017
అబుదాబీ: సివిల్ డిఫెన్స్ టీమ్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది. యూఏఈ రాజధానిలోని సాదియాద్ ఐలాండ్లోగల వర్కర్స్ అకామడేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాదియాద్ ఐలాండ్‌ని నిర్వహిస్తోన్న సంస్థకు చెందిన కార్మికుల అకామడేషన్ ఇది. అగ్ని ప్రమాదం గురించి వివరించిన అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలిల్ అల్ అన్సారీ, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు. వెంటనే సివిల్ డిఫెన్స్ టీమ్స్ రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపు చేశాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







