బహ్రెయిన్‌ జీతాల్లో 4 శాతం వృద్ది!

- September 14, 2017 , by Maagulf
బహ్రెయిన్‌  జీతాల్లో 4 శాతం వృద్ది!

మనామా: వచ్చే ఏడాది నాటికి జీతాల్లో వృద్ధి 4 శాతం ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. మల్టీ నేషనల్‌ కంపెనీలు, అలాగే స్థానికంగా కొలువుదీరిన కంపెనీలు సుమారు 600 సంస్థల్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. జిసిసి దేశాలన్నిటిలోనూ దాదాపు ఇదే తరహా వృద్ధి రేటు నమోదు కానుందని అంచనా. సౌదీ అరేబియాలో ఈ పెరుగుదల 4.5 శాతంగా ఉండొచ్చు. ఈ ఏడాది 4.9 శాతం అంచనాలుంటే, 4.4 మాత్రమే నమోదయ్యింది. కువైట్‌కి సంబంధించి అంచనా 4.9 ఉంటే, వాస్తవం 4.5 మాత్రమే నమోదయ్యింది. బహ్రెయిన్‌ అంచనాలు 4.3 శాతంగా నమోదవుతున్నాయి. రీజియన్‌కి సంబంధించి ఇది అతి తక్కువ అని చెప్పక తప్పదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com