బహ్రెయిన్‌లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు
- September 15, 2017
మనామా: నిన్న రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ఈ ప్రమాదాల్లో ఎవరూ మరణించడంగానీ, ఎవరికీ గాయాలవడంగానీ జరగలేదని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. హిద్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు సివిల్ డిఫెన్స్ టీమ్ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. మరో ఘటనలో షేక్ హమాద్ వెన్యూలోని లేబర్ క్యాంప్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనామాలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం బాగా సంభవించింది. 40 మందికి పైగా కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రమాద తీవ్రతను ముందే గుర్తించిన కార్మికులు అక్కడినుంచి తప్పించుకున్నారు. పూర్తిగా ఆ క్యాంప్ ధ్వంసం కావడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







