ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటు - బాలకృష్ణ
- September 17, 2017
ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సినీ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి మృతి చెందారు. సీనియర్ జర్నలిస్టుగా ఉన్న 52 ఏళ్ల సురేష్ ఉదయం తన ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరుతుండగా గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. దాదాపు ది హిందూ పత్రికలో 25 ఏళ్లు పూర్తి చేసినందుకుగాను ఆయనకు ఈ నెల 20న అవార్డు ఇవ్వనున్నారు. కానీ అంతలోనే ఆయన అకాల మరణం పొందారు.
ఈ నేపధ్యంలో హీరో బాలకృష్ణ తన సంతాపం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ...నాకు సురేష్ తో మంచి అనుబంధం ఉంది, నన్ను ఎక్కువగా ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్ట్ ఆయనే. ఏ విషయాన్నైనా సూటిగా ప్రశ్నించేవాడాయన. అలాంటి మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకుండాపోవడం బాధాకరం. ప్రస్తుతం కుంభకోణంలో షూటింగ్ లో ఉండడం వల్ల ఆయన్ను ఆఖరిసారిగా చూసే అవకాశం దక్కడం లేదని బాధపడుతూనే.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మానసికధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









