ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక
- September 17, 2017
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదికకానుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఇంటర్ రెగు సెపక్తక్రా చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ టోర్నీ నిర్వహణపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ చాంబర్లో ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడామంత్రి టి.పద్మారావు చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ చాంపియన్‌షి్ ప్లో 20 దేశాలు పోటీపడనున్నాయి. ఆతిథ్య భారతతో పాటు జపాన్, థాయ్‌లాండ్, మలేసియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, దక్షిణకొరియా, చైనా, పాకిస్థాన్, నేపాల్, మయన్మార్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం, కంబోడియా, చైనీస్ తైపీ, ఇరాన్ తదితర దేశాలు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ జట్లకు హైటెక్ సిటీలోని హావాస్ హోటల్లో బస ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







