దర్శకధీరుడు రాజమౌళి ఈ ఏడాది ANR అవార్డును అందుకున్నారు
- September 17, 2017
అక్కినేని నాగేశ్వరరావు పురస్కారోత్సవం కన్నుల పండువగా సాగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ ఏడాది ANR అవార్డును అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ సహా.. బాహుబలి క్రియేటర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పాత పాటలను హమ్ చేసి ఆహూతులను ఆశ్చర్యపరిచారు సీఎం.
బాహుబలి సినిమాతో తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాల్లో రెపరెపలాడించిన దర్శకుడు రాజమౌళికి ANR పురస్కారం దక్కింది. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది పురస్కారం దర్శకధీరుడిని వరించింది. సీఎం కేసీఆర్‌తో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ అవార్డును రాజమౌళికి ప్రదానం చేశారు.
రాజమౌళిని పొగడ్తల్లో ముంచెత్తారు వెంకయ్యనాయుడు. బాహుబలి ఓ అద్భుతమని కొనియాడారు. ఈ అవార్డు ఆయనకు ఇవ్వడం సముచితమన్నారు. అలాగే, 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. అదే సమయంలో తెలుగు వస్తేనే ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన కూడా తెస్తే బావుంటుందని ఆకాక్షించారు ఉప రాష్ట్రపతి.
ఇక సీఎం కేసీఆర్ కూడా రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. రాజమౌళి ట్రెండ్ సెట్టర్ అంటూ పొగడ్తలు గుప్పించారు. అక్కినేని జీవితం ఆదర్శప్రాయమని, ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచారని గుర్తుచేశారు. ఏఎన్ఆర్ ఎదుగుతూ చిత్రపరిశ్రమను అభివృద్ధి చేశారని, హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ తీసుకురావడంలో ఏఎన్ఆర్ కృషి ఎంతో ఉందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కేసీఆర్ జనం కోసం ఆలోచించే వ్యక్తి అని.. ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసన్నారు అక్కినేని నాగార్జున. హరితహారం, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం, రణమాఫీలు ప్రజల కోసమే పెట్టారన్నారు. రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు నాగ్.
ఇక ANR లాంటి మహానుభావుడి పేరు మీదున్న అవార్డు అందుకోవడంతో తన మీద బాధ్యత మరింత పెరిగిందన్నారు రాజమౌళి. అక్కినేని అవార్డుకు మరింత గౌరవం తెచ్చేలా శాయశక్తులా కష్టపడతానని చెప్పారు.
వార్డుల ప్రదానోత్సవంలో కేసీఆర్ పాత పాటలను హమ్ చేయడంతో అక్కడున్న వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే.. అనే పాట, పడమట సంధ్యారాగం అనే ట్యూన్‌ను పాడిన కేసీఆర్.. ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం లేదన్నారు. కనీసం ఒక్కటైనా ఇలాంటి పాటలు పెట్టాలని సినీ పరిశ్రమను కోరారు కేసీఆర్.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







