ఫేస్ బుక్ పరిచయం కారణంగా లండన్ లేడి చేతిలో మోసపోయిన ఒక తెలుగు డాక్టర్

- September 18, 2017 , by Maagulf
ఫేస్ బుక్ పరిచయం కారణంగా లండన్ లేడి చేతిలో మోసపోయిన ఒక తెలుగు డాక్టర్

ఫేస్ బుక్‌లో పరిచయాలు, ఆన్‌లైన్‌లో మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి.  కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తికి రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది.  వారిమధ్య రోజూ ఛాటింగ్ జరుగుతోంది. లండన్ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్ చేసి చెప్పింది.  మళ్లీ వెంటనే ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్ కరెన్సీ లేదని, తన దగ్గర 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో ఫోన్ చేయించింది.  ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె ఖాతాలో జమ చేశారు. డబ్బు అందుకున్న మరుక్షణం నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది.  ఆమె నుంచి ఎటువంటి సమాచారంలేదు.  దీంతో ఆ డాక్టర్‌కి అప్పటికి గానీ మెలకువ రాలేదు.  మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ పటమట ఫోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.  
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com