విశాల్-లింగుస్వామిల రెండో 'పందెం కోడి' వస్తోంది!
- September 20, 2017
అటు తమిళంతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విశాల్. 'పందెంకోడి', 'భరణి', 'రాయుడు', 'ఇంద్రుడు', 'పూజ' తదితర చిత్రాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నారు. ఇక విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం 'పందెంకోడి'. లింగుస్వామి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. విశాల్-లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో విశాల్, లింగుస్వామి, రాజ్‌కరణ్ తదితరులు పాల్గొన్నారు.
తొలి చిత్రంలో విశాల్ సరసన మీరా జాస్మిన్ నటించగా, సీక్వెల్‌లో కీర్తిసురేష్ ఆడిపాడనుంది. వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ విభిన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







