హడలెత్తిస్తున్న 'రాజుగారి గది 2' ట్రైలర్...

- September 20, 2017 , by Maagulf
హడలెత్తిస్తున్న 'రాజుగారి గది 2' ట్రైలర్...

తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా వెలిగిపోయిన అక్కినేని నాగేశ్వరరావు తన చివరి వరకు సినీరంగంలోనే ఉన్నారు. ఆయన చివరి చిత్రం తన కుటుంబ సభ్యులైన కొడుకు, మనవళ్లతో 'మనం' చిత్రంలో నటించారు. ఎలాంటి పాత్రలైనా అలవోకగా చేసి దేవదాసు, దసరాబుల్లోడిగా పేరు తెచ్చుకున్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు నేడు. అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజుని పురస్కరించుకుని నాగార్జున నటించిన ' రాజుగారి గది 2' ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది.
నాగ్‌ చేస్తున్న సినిమా 'రాజుగాది గది 2'. 'రాజుగారి గది' చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో నటిస్తుండగా... సమంత ఆత్మగా నటించడం విశేషం. ఈ మామా కోడళ్ల హర్రర్ థ్రిల్లర్‌ను తెరపై చూసేందుకు అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కాకపోతే ఈ ట్రైలర్ లో సమంతని మాత్రం చూపించలేదు..దీంతో కాస్త నిరాశకు లోనయ్యారు ఆడియన్స్. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినమాలో ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజుగారి గది చిత్రంలో టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న బుల్లితెర యాంకర్ ఓంకర్.. ఆ సినిమాకు సీక్వెల్‌గా రాజుగారి గది 2 తో మరో హిట్ కొడతాడో లేదో వేచి చూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com