చెన్నై మెరీనా తీరంలో 9 మంది తీవ్రవాదుల పట్టివేత!
- September 20, 2017
కొన్ని రోజుల క్రితం చెన్నైలో ఇస్టామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడంతోపాటు రాష్ట్ర పోలీసుశాఖ అప్రమత్తమై, నగరంలో భద్రతను పటిష్టతను చేసింది. అయితే అనూహ్యంగా బుధవారం ఏకంగా 9 మంది తీవ్రవాదులు పోలీసులకు పట్టుబడటం పెను సంచలనం కలిగింది. వీరు సముద్రమార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించి రాష్ట్రంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టు విచారణలో తేలింది. చెన్నై తీరంలో బుధవారం ఉదయం భారీగా మోహరించిన పోలీసుల్ని చూసి తీవ్రప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. తీవ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసి భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇదంతా భద్రతా డ్రిల్‌లో భాగమని పోలీసులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మొత్తానికి తీవ్రవాదుల చొరబాటు వాస్తవం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌తో కలిసి మెరైన్ పోలీసులు ఈ భద్రతా డ్రిల్ నిర్వహించారు. రెండు రోజుల ఉమ్మడి కోస్తా భద్రతా డ్రిల్‌లో భాగంగా 'సాగర్కవచ్' పేరుతో బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ డ్రిల్‌లో నేవీ, కోస్ట్గార్డ్తోటు కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు కూడా పాల్గొన్నాయి. స్థానిక జాలర్ల సహకారం కూడా తీసుకున్నారు. డ్రిల్ కోసం రూపొందించిన పథకం ప్రకారం తొమ్మిది మంది తీవ్రవాదుల వేషధారణలో మూడు పడవల్లో చెన్నై తీరానికి వచ్చారు. ముందుగానే రహస్య సమాచారం అందినట్టుగా మెరైన్ పోలీసులు అప్రమత్తమై నేవీ, కోస్ట్‌గార్డ్‌ల సహకారంతో యుద్ధప్రాతి పదికన తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగా మెరీనా తీరంలో నలుగురు, శాస్త్రి నగర్లో మరో ముగ్గురు, కానత్తూరులో ఇద్దరు పట్టుబడ్డారు. 'అరెస్టు చేసిన తీవ్రవాదుల్ని స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది' అని పోలీసు అధికారులు చెప్పారు. చెన్నై పోర్టు ట్రస్టు, ఇంటిలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్, లైట్‌హౌస్ డైరెక్టర్ జనరల్ కూడా డ్రిల్‌లో పాల్గొన్నారు. రెండు బృందాలుగా విడిపోయి తీరం మొత్తం జల్లెడ పట్టారు. సాగర్కవచ్ విజయవంతమైందని, రాష్ట్రంలోకి తీవ్రవాదుల చొరబాటుకు ఆస్కారం లేకుండా అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







