యువతి మాదిరిగా పలువురికి ఫోన్ కాల్స్ చేస్తూ నమ్మకద్రోహం చేస్తూ పట్టుబదిన పౌరుడు

- September 20, 2017 , by Maagulf
యువతి మాదిరిగా పలువురికి  ఫోన్ కాల్స్ చేస్తూ నమ్మకద్రోహం చేస్తూ పట్టుబదిన పౌరుడు

హలో నాకు కొంచెం సహాయం చేయరూ ప్లీజ్ ? అని అర్థిస్తూ ఓ యువతీ మాదిరిగా గొంతు మార్చి ఆ నిందితుడు ఏదో ఒక నెంబర్ ఎంచుకొని గోముగా అడుగుతాడు. ఆ  తర్వాత బాధితులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి...నన్ను పెళ్ళి చేసుకొంటావా ? అని మురిపెంగా  ముగ్గులోకి దించుతాడు. వారు మురిసి  మైమరచిపోయిన తరుణంలో.... అది కొనివ్వవా డియర్ ? ...ఈ  గిఫ్ట్ నాకు ఇష్టం డార్లింగ్ అంటూ వారి వద్ద కొసరి కొసరి తనకు కావాల్సినంత ముద్దుగా అడిగి మరీ దోచుకొంటాడా ఘరానా మోసగాడు. ఆడవారంటే పొంగిపోయే కొందరు  పురుషపుంగవులను ఎన్నుకొని బహుమతుల మీద బహుమతులు సంపాదిస్తున్న వేళ  ఒకరోజు పోలీసులు వలపన్ని ఆ  మాయ(లో)లేడి ని  అదుపులోనికి తీసుకొన్నారు. ధహిరా పోలీస్ కమాండ్ వద్ద విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ తరహా మోసంకు పాల్పడుతున్న ఓ పౌరుడిని అరెస్టు చేశారు. తనతో మాట్లాడుతున్నది ఖచ్చితంగా ఓ అందమైన వివాహం కానీ యువతేనని నిర్ణయించుకొన్న ఓ అమాయకుడు...తనకు కాబోయే భార్య అడిగిందని ఏకంగా తన కారుని ఉన్న పళంగా విక్రయించి ఆ సొమ్ముని  1,900 రాయల్ ఒమాన్ నగదుని  మోసగాడి పరం చేసాడు. ఆ తర్వాత తన ఊహాసుందరి తప్పక వివాహం చేసుకొంటుందని భ్రమించాడు. ఇదే తరహాలో పలువురిని మోసం చేస్తున్న నిందితుడిని ఇటీవల పోలీసులు పట్టుకొన్నారు. తానూ చేసిన నేరాలన్నింటిని ఆ మిమిక్రి మోసగాడు అంగీకరించాడు. ఆ వ్యక్తిని మరింతగా  ప్రశ్నించడానికి న్యాయవ్యవస్థ ఎదుటకు పంపబడ్డాడు. మోసంతో  టెలీకమ్యూనికేషన్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ నిందితునిపై పలు అభియోగాలు మోపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com