యాంకర్ శ్రీముఖి నటిస్తున్న `గుడ్ బ్యాడ్ అగ్లీ`టీజర్ రిలీజ్డ్

- September 23, 2017 , by Maagulf
యాంకర్ శ్రీముఖి నటిస్తున్న `గుడ్ బ్యాడ్ అగ్లీ`టీజర్ రిలీజ్డ్

గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగ‌రిత‌నం అనే ప‌దాలు మ‌న‌కు తెలిసిందే. వీటిని సంద‌ర్భానుసారం వాడుతుంటారు.  ఇప్పుడు వీటినే టైటిల్‌గా పెట్టి  ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఓ సినిమాను తెరకెక్కించారు. యంకర్  శ్రీముఖి, మురళీ ప్రధాన పాత్రలుగా  `గుడ్ బ్యాడ్ అగ్లీ` అనే టైటిల్ తో రూపొందించారు. ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సంగీత సారథ్యం వ‌హించ‌డం మరో విశేషం.  1988-89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జ‌రిగిన ప్రేమ‌కథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు హర్షవర్థన్. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత‌.  ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com