ఐ ఫోన్ బుకింగ్: ఒకటి కాదు, ఎనిమిది!
- September 23, 2017
ప్రపంచ వ్యాప్తంగా ఐ ఫోన్‌కి ఉన్న క్రేజ్ అలాంటిలాంటిది కాదు. యాపిల్ కంపెనీ నుంచి ఐ ఫోన్ కొత్త వెర్షన్ మార్కెట్‌లోకి వస్తోందంటే చాలు, ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటుంది. యూఏఈలోనూ అదే ఉత్కంఠ నెలకొంది. ఈసారి మొట్టమొదట ఐఫోన్‌ని యూఏఈలో దక్కించుకున్న వ్యక్తి పేరు ఇబ్రహీమ్ అల్‌ఛామ్సి. ఉదయం 8 గంటలకే దుబాయ్ - మాల్ ఆఫ్ ఎమిరేట్స్, అఉబదాబీ - యాస్ మాల్ వద్ద ఐ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి వినియోగదారుడు ఇడ్రహీమ్, తొలి ఐఫోన్‌ని యూఏఈలో సొంతం చేసుకుని పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆయన ఒక్క ఫోన్‌తో సరిపెట్టలేదు. మొత్తం 12 ఫోన్లను దక్కించుకున్నాడు. 'నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసం' అని చెప్పాడు 12 ఫోన్ల గురించి అడిగితే. రెండో వినియోగదారుడి పేరు బఖిత్ సయీద్ అలసుబౌషి. మిగతా ఖరీదైన ఫోన్లకంటే ఐఫోన్ ప్రత్యేకమైనది కావడంతోనే దీని కోసం బుక్ చేశానని చెప్పారాయన.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







