తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ ఆఫర్
- September 23, 2017
నూతన సంవత్సర కానుకగా ఇంటింటికి సురక్షిత తాగునీరు అందివ్వబోతోంది తెలంగాణ సర్కార్. మిషన్ భగీరథపై సమీక్ష చేసిన కేసీఆర్..పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాతిక వేల ఆవాస ప్రాంతాలకు నీరిచ్చే పథకం.. ఇంజనీరింగ్ అద్భుతమన్నారు.
శుద్ధిచేసిన నీటిని రోజూ ప్రతీ ఇంటికీ అందించే మిషన్ భగీరథ లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు సీఎం కేసీఆర్. జనవరి 1నుంచి అన్ని గ్రామాలకు నీరు అందించేలా పనులను పరిగెత్తించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పనులను గూగుల్ మ్యాప్ ద్వారా సీఎం పరిశీలించారు.ఎక్కడెక్కడ ఏ సమస్య తలెత్తున్నదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలు, సెగ్మెంట్ల వారీగా ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, OHBRల నిర్మాణం, పైపులైన్లు, ఎలక్ట్రో మోటార్ పనుల పురోగతిని సమీక్షించారు.
మిషన్ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. తొలి విడత పనులను డిసెంబర్ 31లోగా, రెండో విడత పనులను 2018 జూన్ నాటికి పూర్తి చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో కొద్ది నెలల పాటు సహజమైన సమస్యలు తలెత్తుతాయన్న కేసీఆర్.. వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూనే ముందుకు సాగాలని సూచించారు. నీటి ప్రవాహ ఒత్తిడి వల్ల ప్రారంభంలో పైపులు, వాల్వ్‌ల వద్ద లీకేజీ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. లీకేజీలు ఏర్పడితే భయపడి పోవద్దని..పథకం ప్రారంభమైన గజ్వేల్‌లోనూ రెండు నెలల వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని సీఎం గుర్తుచేశారు.
మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అద్భుతమన్న కేసీఆర్...25 వేల ఆవాస ప్రాంతాలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించే పథకం ఎక్కడ లేదన్నారు. గిరిజన తండాలు, దళిత వాడలు, గోండు గూడేలకు కూడా నూరు శాతం మంచినీరు అందించాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథను నీతి ఆయోగ్‌తో పాటు అనేక రాష్ట్రాలు మెచ్చుకున్నాయని..ఉత్తరాది ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అధ్యయనం కూడా చేశాయన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం అందరికీ గర్వకారణమని చెప్పారు. మరోవైపు మిషన్ భగీరథకు అవసనరమయ్యే సబ్ స్టేషన్లు, విద్యుత్‌లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లను విద్యుత్ శాఖ సిద్దం చేసింది. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను లక్ష్యానికి మూడు నెలల ముందే అందించిన ట్రాన్స్‌కో సీఎండీని కేసీఆర్ అభినందించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







