పోలీసు జీవితం ఆధారంగా వస్తున్న 'ఖాకీ'

- September 24, 2017 , by Maagulf
పోలీసు జీవితం ఆధారంగా వస్తున్న 'ఖాకీ'

కార్తి కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కుతున్న 'ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు' తెలుగులో 'ఖాకీ' పేరుతో విడుదలవుతోంది. 'ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌...' అనేది ఉపశీర్షిక. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీజర్‌ని ఈ నెల 27న, ట్రైలర్‌ని వచ్చే నెల 17న ఆవిష్కరిస్తారు. నవంబరు 17న చిత్రాన్ని విడుదల చేస్తారు. ''దర్శకుడు వినోద్‌ తయారు చేసిన 'ఖాకీ' కథ వినగానే ఎలాగైనా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందించాలని హక్కుల్ని సొంతం చేసుకొన్నాం. 2005లో ఓ పత్రికలో ప్రచురితమైన ఓ సంఘటన ఆధారంగా ఈ కథని తీర్చిదిద్దాడు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో కార్తీ శక్తివంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఒక పోలీసు జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివన్నది తెరపైనే చూడాలి. జిబ్రాన్‌ సంగీతం బాగుంటుంద'' అన్నారు నిర్మాతలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com