దుఖఃలియహ్ గవర్నరేట్ పరిధిలో 40 ఉద్యోగ అవకాశాలకు 160 మంది అభ్యర్థులు

- September 25, 2017 , by Maagulf
దుఖఃలియహ్ గవర్నరేట్ పరిధిలో 40 ఉద్యోగ అవకాశాలకు 160  మంది అభ్యర్థులు

మస్కట్ : దుఖఃలియహ్ గవర్నరేట్ పరిధిలో వివిధ సంస్థలలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ డైరక్టరేట్ జనరల్  ప్రాతినిధ్యం వహిస్తూ 40 ఉద్యోగ అవకాశాలకు 160 మంది అభ్యర్థులను సోమవారం ఇంటర్వ్యూ చేశారు. ఈ మేరకు మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక పత్రికా ప్రకటన చేస్తూ,తాము నిర్వహించిన ఇంటర్వ్యూ లలో మొత్తం ఖాళీలు సమర్పించిన సంస్థలను ఉదహరించారు. అవి ఘంటాన్ రవాణా మరియు జనరల్ కాంట్రాక్టింగ్, అబ్దుల్లా బిన్ హుమ్ద్ బిన్ మహ్మూద్ అల్ శుకైలీ సంస్థ, ఎల్క ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్, అల్ అన్వర్ సెరామిక్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు మరియు వాస్తుశిల్పులు సహా 40 ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూ కోసం 190 ఉద్యోగ అభ్యర్థులను పిలవగా మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. వారిలో 30 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కు  హాజరు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com