త్వరలో తండ్రి కాబోతున్నబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్

- September 26, 2017 , by Maagulf
త్వరలో తండ్రి కాబోతున్నబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు..! అదేమిటి పెళ్లి కాని సల్మాన్ ఖాన్ తండ్రి కావడమేమిటి అనుకొంటున్నారా..? లేక సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు .. అని అనుకుంటున్నారా..! సల్మాన్ తండ్రి కాబోతున్నాడు అన్నది నిజమే.. కాకపోతే సరోగసీ ద్వారా తండ్రి కాబోతున్నాడు.. ఇప్పుడు సెలబ్రిటీలు ఎక్కువగా సరోగసీ ద్వారా సంతానం పొందడానికే ఆక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే ఫరాఖాన్, తుషార్ కపూర్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు టాలీవుడ్ లో మంచు లక్ష్మి కూడా సరోగసీని ఆశ్రయించారు. 
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.. తాజాగా ఈ జాబితాలో జాయిన్ కావడానికి సల్మాన్ ఖాన్ కూడా రెడీ అవుతున్నట్లు బీ టౌన్ టాక్.. తాను ఓ మంచి భర్త కాకపోయినా... మంచి తండ్రిని కాగలను అని గతంలో ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.. ఆ మాట నిజం అనిపించేలా చెల్లెలు తనయుడితో సల్మాన్ ఖాన్ ఆడుతూ పాడుతూ ముద్దు చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉన్నాం.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న సల్మాన్ ఖాన్ మరో రెండు ఏళ్ల తర్వాత సరోగసీ ద్వారా తండ్రి కావాలని ఆలోచిస్తున్నాడట.. !!   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com