ఈ మలయాళీ సూపర్ స్టార్‌కి బ్రహ్మణుడిగా పుట్టాలని ఉందట..

- September 26, 2017 , by Maagulf
ఈ మలయాళీ సూపర్ స్టార్‌కి బ్రహ్మణుడిగా పుట్టాలని ఉందట..

తెలంగాణలో ఆర్యవైశ్యులు, బలహీనవర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఒకరు మా కులం గొప్పది అంటే మరొకరు మా కులం  గొప్పది అంటూ తీవ్రస్థాయిలో వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ సూపర్ స్టార్ , బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ నేనే వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాలనుకుంటున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
తిరువనంతపురంలో బ్రాహ్మణులు నిర్వహిస్తున్న 'యోగక్షేమ' సభకు సురేశ్ గోపీ స్పెషల్ గెస్టుగా వచ్చారు. అక్కడ ఆయన ప్రసంగంలో... 'పునర్జన్మ పై నాకు నమ్మకం ఉంది. వచ్చే జన్మలో జంధ్యం ధరించే కులంలో పుడతా. బ్రహ్మణుడిగా పుట్టి శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా బాధ్యతలు స్వీకరించాలని ఉందని తెలిపాడు. ఫలితంగా శబరిమల అయ్యప్పని తాకవచ్చు...స్నానం చేయించొచ్చు అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అలాగే జంధ్యం ధరించిన వారినందరినీ దేవుళ్లుగా పరిగణించాలని సూచించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com