ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్లు తప్పనిసరి..లేకుంటే పెట్రోల్ బంద్
- September 27, 2017
ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి హెల్మెట్లు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. హెల్మెట్లు ధరించకపోయినా, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోయినా పెట్రోల్ పోయవద్దంటూ బంక్‌లకు ఆర్డర్ పాస్ చేశారు. రహదారి భద్రతపై సమీక్ష జరిపిన ఏపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేయాలని రవాణా, పోలీస్ శాఖలకు సూచించారు సీఎం. హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించని వారికి.. ఎక్కడైనా పెట్రోల్ పోసినట్లు తెలిస్తే.. ఆ బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారీతనం మరింత పెరగాలన్నారు సీఎం చంద్రబాబు. నియమాలు కఠినంగా ఉన్నా, అమలు బాగుంటేనే ప్రమాదాలను నివారించగలమన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్‌లోడ్ ఆటోలను నియంత్రించాలని సూచించారు. అన్ని స్కూల్ బస్సులు, ప్యాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి చేయాలన్నారు. రహదారి భద్రత కోసం వినియోగించే పరికారల కోసం 10 కోట్ల రూపాయలను విడుదల చేశారు ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







