కుమారి 21ఎఫ్ చిత్రం ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు
- November 01, 2015
''స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఓ షార్ట్ ఫిలిం చేయాలనుకున్నా. సుకుమార్‌కి ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మన్నాను. యాడ్ ఫిలిం తీద్దామని చెప్పగానే కాన్సెప్ట్ ఏంటి అని అడిగాడే కానీ ఎప్పుడు తీయాలి? ఏంటనే ప్రశ్నలు అడగలేదు. మా ఇద్దరికీ ఉన్న అనుబంధం అలాంటిది. అన్నీ కుదిరితే 'ఆర్య'ను మర్చిపోయేలా సుకుమార్, నేనూ త్వరలో సినిమా చేస్తాం'' అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం 'కుమారి 21ఎఫ్'. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. ఈ చిత్రం ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించి, దర్శకుడు సురేందర్‌రెడ్డికి అందించారు. ''దర్శకుడు ప్రతాప్ లేకపోతే ఈ సినిమా లేదు. అతనే ఎంకరేజ్ చేసి నాతో ఈ సినిమా స్క్రిప్ట్ రాయించాడు. నేను సినిమా తీద్దామని చెప్పగానే దేవిశ్రీప్రసాద్, రత్నవేలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఏడాది పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. ఇండస్ట్రీలో బంధాలన్నీ కృత్రిమం అని చాలా మంది అంటుంటారు. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. మామూలుగా మనం ఎవరికైనా కాల్ చేస్తే ఎలా ఉన్నారు? అని అడుగుతాం. కానీ నేను బన్నీకి కాల్ చేస్తే అతను అడిగే మొట్టమొదటి మాట 'ఏం కావాలి' అని. నా బ్యాంక్ బన్నీ'' అని సుకుమార్ చెప్పారు. ఈ వేడుకలో బీవీఎస్ఎన్ ప్రసాద్, 'దిల్' రాజు, పి. కిరణ్, బన్నీ వాస్, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్, విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి, రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









