కోర్టు ప్రాంగణంలో మహిళ చెవి కొరికేసిన వ్యక్తి
- September 28, 2017
ఓ మహిళ దుబాయ్ కోర్టులో తన వద్ద పనిచేసే ఫిమేల్ స్టాఫ్‌కి సంబంధించిన లేబర్ కేసు కోసం రాగా, అక్కడే ఆ ప్రాంగణంలోనే ఓ వ్యక్తి ఆమె చెవిని కొరికేశాడు. ఈ ఘటనలో ఆమె చెవికి శాశ్వత డ్యామేజీ జరిగింది. అయితే నిందితుడు మాత్రం తాను ఆమెపై దాడి చేయాలనుకోలేదనీ, తనపై దాడి జరుగుతున్న క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించానని విచారణలో పోలీసులకు తెలిపాడు. అయితే బాధితురాలు మాత్రం తనపై నిందితుడు కావాలనే దాడి చేశాడననీ, ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నుంచీ అతడు తనను ఫాలో అవుతున్నాడనీ, సమయం చూసి తనపై దాడి చేశాడనీ, తన చెవి పూర్తిగా అతని నోటిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. నిందితుడు జరిపిన దాడిలోనే బాధితురాలు చెవిని కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. అక్టోబర్ 16వ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా పడింది. మే 14న ఈ ఘటన జరిగింది. తన భార్యను ఆమె యజమాని అయిన మహిళ వేధిస్తుండడంతోనే ఆమెపై నిందితుడు దాడి చేసినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







