పోలీస్ శిక్షణలో ఆఫ్గాన్ పోలీసులకు భారత్ శిక్షణ
- September 28, 2017
పోలీస్ శిక్షణలో సాంకేతిక సహకారానికి సంబంధించి భారత్, ఆఫ్గానిస్థాన్‌ల మధ్య గురువారం అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆఫ్గాన్ ముఖ్య కార్యనిర్వాహకుడు (అధ్యక్షుడితో సమానమైన హోదా) అబ్దుల్లా అబ్దుల్లా ఈ మేరకు దిల్లీలో పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..ఆఫ్గానిస్థాన్ అభివృద్ధికి, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనటానికి, ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవటానికి భారత్ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని పునరుద్ఘాటించారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత దృఢతరం కావాలని ఆకాంక్షించారు. ఈ భేటీ సందర్భంగా ఆఫ్గానిస్థాన్ కళాకారులు ప్రత్యేకనైపుణ్యంతో తీర్చిదిద్దిన మొజాయిక్ చిత్రాన్ని ప్రధాని మోదీకి అబ్దుల్లా బహూకరించారు. భారత పర్యటనకు వచ్చిన అబ్దుల్లా గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









