రాబోయే రోజులలో ఏపీకే సైబర్ దాడుల ప్రమాదం ఎక్కువ : మంత్రి లోకేశ్
- September 29, 2017
ఐటీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందుందని, అలాగే సైబర్ దాడులు జరిగే ప్రమాదం కూడా ఏపీకే ఎక్కువగా ఉందని ఐటీశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. కాగా ఈ రోజు ఆయన ఐటీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. సెకనుకు 12 మంది సైబర్ నేరాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాల సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాఫ్ట్వేర్, డేటా సెక్యూరిటీ లక్ష్యంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







