ఆదివారం నుండి ప్రవాసీయులకు నూతన వైద్య ఛార్జీలు

- September 29, 2017 , by Maagulf
ఆదివారం నుండి ప్రవాసీయులకు నూతన వైద్య ఛార్జీలు

కువైట్: కువైట్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, పాలీక్లినిక్స్ లలో  ఆదివారం ( ఎల్లుండి ) నుండి ప్రవాసీయులకు అందించే వైద్య సేవలలో పెంచబడిన ఫీజులు అమలు చేయబడతాయి. ఆరోగ్యం మంత్రిత్వ శాఖ స్థానిక వైద్య సదుపాయాలకు కొత్త ఫీజులను అమలుచేయనున్నట్లు నివేదించింది. ఇందులో జనరల్ ఆసుపత్రి లోని అత్యవసర విభాగానికి వెళితే, 5 కువైట్ దినార్ లను చెల్లించాలి. ఔట్ పేషెంట్ గా  ఆసుపత్రిని సందర్శిస్తే 10 కువైట్ దినార్ లను,ఇన్ పేషెంట్ లు క్లినిక్లు లో ఉంటె  రోగులకు రోజుకు10  కువైట్ దినార్ లను ఫీజుగా ఇవ్వాల్సిఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( ఐ సి యు ) లో కనుక ఉన్నట్లయితే  30 కువైట్ దినార్ లను ఇవ్వాల్సిఉంది. ప్రైవేట్ రూమ్ కనుక తీసుకొన్నట్లయితే  50 కువైట్ దినార్ లను మరియు 200 కువైట్ దినార్ లను డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంది. ప్రసూతి కొరకు అయితే 10 కువైట్ దినార్ లను కేంద్రానికి అసందర్శించిన ప్రతిసారి సేకరిస్తారు. అంతే కాకుండా, అదనంగా మరో 50 కువైట్ దినార్ లనుసాధారణ డెలివరీ కోసం చెల్లించాల్సి ఉంది.ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త ఫీజులను అమలు చేయాలని ఇప్పటికి ఈ ఫీజులను వాయిదా వేయాలని ఎంపీ ఖలీద్ అల్-ఓటిబీ అభ్యర్ధించారు.. ఎంపీ ప్రకారం, ప్రవాసీయులకు ఆరోగ్య సేవల కోసం ఫీజులను పెంచడం తప్పనిసరిని కువైట్ ప్రభుత్వ ఆరోగ్యం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com