ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే 'వొలోకాఫ్టర్' సిద్ధం !!

- September 29, 2017 , by Maagulf
ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే 'వొలోకాఫ్టర్'  సిద్ధం !!

దుబాయ్‌: ఫోటోలు ..వీడియోలు తీసేందుకు  డ్రోన్ హెలీకాఫ్టర్లను మనవాళ్ళు ఉపయోగించడం చూసేం. వాటినే కొద్దిగా అభివృద్ధి చేసి మనుష్యులను ఒక చోటు నుంచి మరొక చోటుకి రవాణా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ ఔత్సాహికునికి కల్గింది. వెంటనే పలు ప్రయోగాలు చేసి దాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనుషులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు వీలుగా తయారు చేసిన పైలెట్‌ రహిత '‘వెలోకాప్టర్‌’ను దుబాయ్‌ రోడ్డు అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ శుక్రవారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో తయారు చేసిన ఈ వెలోకాప్టర్‌ను ప్రయాణికులు లేకుండా ప్రయోగించి విజయం సాధించింది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వెలోకాప్టర్‌ను జర్మనీకి చెందిన ఓ డ్రోన్‌ సంస్థ తయారు చేసింది. రిమోట్‌ కంట్రోల్‌తో అవసరం లేకుండా నడిచే ఈ వెలోకాప్టర్‌ 30 నిమిషాలపాటు నిరాటకంగా గాల్లో ఎగురగలదు. 18 ప్రొపెల్లర్లు, రోటర్లతో నడిచే ఈ వెలోకాప్టర్‌లో బ్యాటరీ బ్యాకప్‌ను, అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు పారాచూట్లు కూడా ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఈ వెలోకాప్టర్‌ను ప్రయాణికులే ఆపరేట్‌ చేయవచ్చని, యాప్‌ ద్వారా వెలోకాప్టర్‌ను బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని వెలోకాప్టర్‌ సీఈవో ఫ్లోరియన్‌ రాయిటర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com