భారత్‌కు నిత్యం తలనొప్పులు సృష్టిస్తోన్న చైనా
- October 01, 2017
అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో చైనా కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను ఆదివారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి న్యియింషి వరకు 409 కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.3.78లక్షల కోట్లు (5.8 యూఎస్ డాలర్లు) ఖర్చు చేశారు. న్యియింషి అనే ప్రాంతం భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు చేరువలో ఉన్నది. చైనాలోని రెండు ప్రముఖ పర్యాటక నగరాలను కలుపుతూ ఈ రహదారిని నిర్మించినట్టు అక్కడి మీడియా పేర్కొన్నది. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. టిబెట్‌లో నిర్మించిన అనేక ఎక్స్‌ప్రెస్ హైవేలను సైనికదళాలు, ఆయుధాలను తరలించేందుకు చైనా ఉపయోగిస్తున్నది. భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వివాదాస్పదంగా ఉన్నది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమని చైనా వాదిస్తున్నది.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









