బుర్జీల్‌ మెడికల్‌ సెంటర్‌లో వరల్డ్‌ హార్ట్‌ డే

- October 01, 2017 , by Maagulf
బుర్జీల్‌ మెడికల్‌ సెంటర్‌లో వరల్డ్‌ హార్ట్‌ డే

మస్కట్‌: అజీబాలోని బుర్జీల్‌ మెడికల్‌ సెంటర్‌లో వరల్డ్‌ హార్ట్‌ డే సెలబ్రేషన్స్‌ సెప్టెంబర్‌ 30న జరిగాయి. హృద్రోగంపై అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరిలోనూ గుండె పనితీరు పట్ల అవగాహన తప్పనిసరి అని ఈ సందర్భంగా హృద్రోగ నిపుణులు చెప్పారు. బుర్జీల్‌ మెడికల్‌ సెంటర్‌లో వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా హృద్రోగ నిపుణులు డాక్టర్‌ మగెద్‌ అబౌల్‌సియోద్‌ నేతృత్వంలో ఉచిత కార్డియాలజీ కన్సల్టేషన్‌ సేవలు హృద్రోగులకు అందజేశారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా హెల్తీ హార్ట్‌ ప్యాకేజీలను కూడా ప్రకటించారు. వివిధ రకాలైన కారణాలతో హృద్రోగ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని డాక్టర్‌ అబౌల్‌సియోద్‌ చెప్పారు. బుర్జీల్‌ మెడికల్‌ సెంటర్‌లో నిపుణులైన వైద్యులు, అత్యాధునిక సౌకర్యాలతో హృద్రోగ బాధితులకు సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com