బహ్రెయిన్‌లో 'స్వచ్ఛతా హి సేవ' క్యాంపెయిన్‌

- October 01, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో 'స్వచ్ఛతా హి సేవ' క్యాంపెయిన్‌

మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్‌ ఎంబసీ, 'స్వచ్ఛతా హి సేవా' క్యాంపెయిన్‌ని నిర్వహించింది. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ మూడో వార్షికోత్సవం సందర్భంగా 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేపట్టేందుకు భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్‌లోనూ ఇండియన్‌ ఎంబసీ ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతోంది. బహ్రెయిన్‌లో ఇండియన్‌ అంబాసిడర్‌ అలోక్‌ కుమార్‌ సిన్హా, ఈ సందర్భంగా స్వచ్ఛతపై అవగాహన ప్రతి ఒక్కరిలోనూ తప్పనిసరి అని చెప్పారు. ప్రముఖ బాలీవుడవ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, అక్టోబర్‌ 2వ తేదీని స్వచ్ఛ భారత్‌ దివస్‌గా పరిగణిస్తోన్న సంగతి తెలిసినదే. అరేబియన్‌ క్రికెట్‌ ఫెస్టివల్‌లో పాల్గొననుండడం, అలాగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం, స్వచ్ఛ భారత్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా ఆనందంగా ఉందని సునీల్‌ శెట్టి చెప్పారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ ఈ సందర్భంగా అలోక్‌ కుమార్‌ సిన్హా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com