216 అడుగుల ఎత్తుతో శంషాబాద్‌లో రామానుజాచార్యుల విగ్రహం
- October 01, 2017
-శంషాబాద్ పరిధి శ్రీరామనగరంలో రూపుదిద్దుకుంటున్న సమతామూర్తి భగవత్ రామానుజాచార్యుల భారీ విగ్రహం -216 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠాపన -వేగంగా తొలిదశ పనులు -స్ఫూర్తి కేంద్రాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ సమతామూర్తి, పెదజీయర్ శ్రీ రామానుజాచార్యుల స్ఫూర్తికేంద్రం మరో మణిహారం కానుంది. ఈ భారీ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శ్రీరామనగరంలో రూపుదిద్దుకుంటోంది. రూ. 1000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు మూడు దశల్లో 2022 నాటికి పూర్తికానున్నాయి. తొలిదశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సుమారు 216 కోట్ల అంచనాతో వచ్చే ఏడాదికి మొదటి ప్రధాన కేంద్రం భద్రవేది, రామానుజుల విగ్రహ ప్రతిష్ఠకు అవసరమైన ప్రధాన నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2014 మేలో స్ఫూర్తికేంద్రం ఏర్పాటుకు శ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి స్వీయ పర్యవేక్షణలో భూమిపూజ చేశారు. ప్రస్తుత ప్రాజెక్టు పనులు కూడా స్వామి వారి స్వీయపర్యవేక్షణలోనే సాగుతున్నవి. స్ఫూర్త్తికేంద్రంలోని ప్రధాన అంతర్భాగం భద్రవేదిలో 216 అడుగుల ఎత్తులో ఆశీన పంచలోహమూర్తి రామానుజుల విగ్రహం ఉంటుంది.
ఉత్తమ సాంకేతిక ఆధునిక పరిజ్ఞానంతో శ్రీ రామానుజుల సహస్రాబ్ధ్ది విగ్రహ ప్రతిష్టమహోత్సవానికి వచ్చే ఏడాది ముఖ్యఅతిథులుగా దేశ ప్రధాని నరేంద్రమోడీని శ్రీశ్రీ చినజీయర్‌స్వామి, మహా సిమెంట్, మైహోంగ్రూపు సంస్థల అధినేత డా.జూపల్లి రామేశ్వర్రావు ప్రభృతులు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. రామానుజ విగ్రహ విశిష్టతలు..... ఎత్తు 216 అడుగులు, 1100 టన్నుల భారీ రామానుజుల ఆశీనమూర్తి పంచలోహంతో విగ్రహం తయారీ కొనసాగుతున్నది. స్ఫూర్తి కేంద్రంలో నిత్యపూజలు అందుకునే 120 కిలోల బంగారంతో స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. అద్భుతమైన మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఉత్తమ సాంకేతిక విజ్ఞానంతో శ్రీరామానుజుల జీవత విశేషాలను తెలియజేసే సన్నివేశాలు, వివిధ ప్రదర్శనలు ఉంటాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







