చర్మ సోయగానికి...
- April 29, 2015
అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కాకపోతే పార్లర్లకి వెళ్ళే తీరిక, ఓపిక కొందరికి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం ఇంట్లోనే ఆచరించదగిన చిట్కాలు..
- నిమ్మరసం: చాల తేలికైన చిట్కా ఇది. టేబుల్ స్పూను నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖం కడుక్కుంటే మిల మిల మెరుస్తూంటుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
- టమాటోరసం: టమాటో రసాన్ని స్నానికి ముందు ముఖం అంతా పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం స్నానం చేస్తే మంచిది.
- ఓట్ మీల్: ఓట్మీల్, బాదాంపప్పులను పొడిచేసి దానిలో పాలు,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరమంతా పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచిది.
- పాలు: ముఖం మీద మురికిని తొలగించడానికి పాలు బాగా ఉపకరిస్తాయి.రాత్రి పడుకోవటానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజెర్ అప్లై చేసుకోవాలి. పాలు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడంలో బాగా ఉపకరిస్తుంది. చర్మం లోపలిదాకా వెళ్లి మురికిని తొలగించడమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది.
- శాండిల్ వుడ్: శాండిల్ వుడ్ పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







