హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం

- October 02, 2017 , by Maagulf
హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం

మరో మూడు రోజులు హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నట్టు చెప్పారు. మరోవైపు  అండమాన్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.  
దసరా, గాంధీ జయంతి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి ఆఫీసులు ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారికి.. నరకం చూపించనున్నాయి రోడ్లు. రాత్రి కురిసిన వర్షంతో నిలిచిన నీటిని దాటుకుని వెళ్లాలంటే.. ప్రజలకు తిప్పలు తప్పవు. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com