మోడీ కి కోవెల నిర్మాణం
- October 03, 2017
మీరట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం ఆలయం నిర్మించాలని ఓ మాజీ ఇంజినీర్ నిర్ణయించుకున్నారు. అందులో 100 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఈ ఆలయంలో మోదీ విగ్రహానికి పూజలు చేయడానికి మాత్రం వీల్లేదు. త్వరలోనే మీరట్‌లో దీని నిర్మాణం ప్రారంభం కానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన జేపీ సింగ్ రిటైర్డ్ ఇంజినీర్. 'మోదీ మందిర్' పేరుతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆలయం మోదీ గౌరవార్థం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సింగ్ వెల్లడించారు. 'ప్రజల కోసం మోదీ ఎంతో చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆయనలా చేయలేదు. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ మందిర్‌ను నిర్మిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఆయన విగ్రహం ఉంటుంది. ఆలయ గర్భగుడిలో విష్ణు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటాయి.' అని ఆయన వెల్లడించారు.
రూ.10కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మరో రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు విరాళాల ద్వారా సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







