ఇవాళ్టి నుంచి కొ్త్త అందాలుతో కనువిందు చేయనున్న చార్మినార్
- October 05, 2017
చార్మినార్ కొత్త అందాలు అద్దుకుంటోంది. చార్మినార్ పరిసరాల్లో అందంగా ముస్తాబుకానున్నాయి. కాలుష్యం భారి నుంచి సంరక్షించడంతో పాటు దేశ, విదేశీ పర్యటకులను మరింతగా ఆకర్షించేందుకు కొత్త వన్నెలు తెస్తున్నారు. కొంత కాలంగా జోరుగా సాగుతున్న చార్మినార్ పెడస్ట్రేషన్ జోన్(పాదచారుల వంతెన) పనులను మరింత వేగంగా కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.చార్మినార్ పాదచారుల వంతెన పనుల్లో భాగంగా చార్మినార్‌ను సందరీకరణ పనులు సైతం చేపడుతున్నారు. ఇందులో భాగంగా మదీనా నుంచి చార్మినార్ పాదాచారుల వంతెన సాగుతున్న మార్గాల్లోని వ్యాపార సముదాయాలకు జీహెచ్‌ఎంసీ రూపొందించిన సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మదీనా నుంచి గుల్జర్‌హౌస్ వరకు యూనిఫాం సైన్ బోర్డులను బిగించారు.చార్మినార్ వద్ద ఏర్పాటు కాబోతున్న పాదచారుల వంతెన ప్రాజెక్ట్‌లో భాగంగా దారికి రెండు వైపులా ఫ్లాట్ ఫాంలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లాట్ ఫాంపై ప్రత్యేక ఎల్‌ఈడీ లైట్లను బిగిస్తారు. దేశంలో ఇప్పటి వరకు ఉపయోగించని విధంగా ప్రత్యేక విద్యుత్ స్తంభాలను పాదచారుల వంతెన ప్రాజెక్ట్‌లో వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత వాటికన్ సిటీ రూపపురేఖలను పొలి ఉండేలా చార్మినార్ అందాలను మార్చబోతున్నామని జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే చార్మినార్‌కు మూడు వైపులా పాదచారుల పనులు పూర్తి చేశామన్నారు.చార్మినార్ సమీపంలోని కమాన్‌లను సైతం మెరుగు పరుస్తున్నామని ,వాటిని అధునికంగా తీర్చిదిద్దడానికి జీహెచ్‌ఎంసీ నిధులను సమకూర్చనుందన్నారు.
శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ మొదలువుతుందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









