గోవాలో ఈరోజు రాత్రి 11 గం. 52 ని. లకు సామ్ మెడలో మూడుముళ్లు వేయనున్న చైతు

- October 05, 2017 , by Maagulf
గోవాలో ఈరోజు రాత్రి 11 గం. 52 ని. లకు సామ్ మెడలో మూడుముళ్లు వేయనున్న చైతు

సమంత, నాగ చైతన్య మరికొద్ది గంటల్లో వివాహ బంధంతో ఏకం కాబోతున్నారు. స్వర్గధామం గోవాలో వీరి వివాహం జరగనుంది. గోవాలోని స్టార్ హోటల్ 'డబ్ల్యు'లో సమంత, చైతన్య వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ రాత్రి 11 గంటల 52 నిమిషాలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెళ్లి వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పూర్తయిన తర్వాత అక్టోబర్ 7వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల మధ్య క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరగనుంది. 

హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి గెస్టులు ఇప్పటికే గోవా చేరుకున్నారు. చైతన్య హిందూ, సమంత క్రిస్టియన్ కావడంతో రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక జరుగబోతోంది. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఈ వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు. చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని సమంత, చైతన్య నిర్ణయించుకోవడంతో వారి అభీష్టం మేరకే పెళ్లి చేస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ను మాత్రమే ఆహ్వానించారు. రామానాయుడు ఫ్యామిలీ, అక్కినేని కుటుంబ సభ్యులు అంతా కలిపి 100 మంది నాగ చైతన్య తరపున ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. సమంత తరపు నుంచి కూడా చాలా తక్కువ మందే హాజరవనున్నారు. 

గోవాలో జరగనున్న నాగ చైతన్య-సమంత పెళ్లి వేడుక ఖర్చు 10 కోట్ల రూపాయలకు మించదని, ఈ ఖర్చు వీరి స్టేటస్‌కు చాలా తక్కువే అయినా... చైతన్య, సమంత చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇలా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరుగుతున్నా.. రిసెప్షన్ లావిష్ గా జరపాలని నాగార్జున ప్లాన్ చేశారు. పెళ్లి తర్వాత చైతు, సమంత షూటింగుల్లో బిజీ అవనున్నారు. ఈనెల 15వ తేదీన‌ రిసెప్షన్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలిసింది.  

పెళ్లి వేడుకలో నాగ చైతన్య ట్రెడిషనల్ ధోతీ ధరిస్తారు. క్రిస్టియన్ వెడ్డింగులో సమంత..., స్టైలిష్ డిజైనర్ క్రేష్నా బజాజ్ డిజైన్ చేసిన దుస్తులు ధరించనుంది. చైతు 3 పీస్ సూట్ ధరిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com