కెనడాకు చెందిన మోడల్ కంటిలో టాటూ వేయించుకొని చూపు పోగొట్టుకుంది
- October 06, 2017
తమ బాడీని అందంగా తీర్చదిద్దడానికి నేటి యువత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టాటూ పేరుతో ఒళ్లంతా టాటాలు వేయించుకోవడం ...ఢిఫారెంట్ డిజైన్స్ ...వెరైటీ కలర్స్ తో బాడీలో ఉన్న చేతులు, కాళ్లు, వీపు, గొంతు, ఎద..బుగ్గలు తేడలేకుండా టాటూలు వేయించుకొని ముచ్చటపడుతున్నారు.
కెనడాకు చెందిన మోడల్ గాలింగర్ కూడా టాటూల పై మోజు పడింది. అందరిలా కాకుండా ఢిఫారెంట్ గా ట్రై చేద్దాం అనుకుంది. అందరు ఒంటి మీద దృష్టి పెడితే గాలింగర్ మాత్రం కంటి మీద ఫోకస్ పెట్టింది. కంటిల్లో వైలెట్ కలర్ తో టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయింది. అలస్యం చేయకుండా టాటూ డిజైనర్ దగ్గరకు వెళ్లి కుడి కంటి తెల్లగుడ్డు పై ఐబాల్ పేరిట టాటూ వేయించుకుంది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలైయ్యాయి. ఫస్టు కంటిలో నుంచి వైలెట్ కలర్ లో టియర్స్ మంటతో వచ్చాయి. కన్ను భాగం అంతా వాచిపోయింది. భయపడి డాక్టర్ దగ్గరకు వెళ్తే చూపుకు కారణమైన కార్నియా దెబ్బతిందని తెలిపారు. సర్జరీ చేస్తే మెరుగు అవచ్చు అనే సలహా మేరకు సర్జరీకి సిద్ధమైంది. యువతకి ఉత్సహం ఉండవచ్చు కానీ అత్యుత్సాహం ఉండకూడదు. అత్యుత్సాహం ఉన్నా బాడీలోని సెన్సిటివ్ పార్ట్స్ పై ప్రయోగం చేయొద్దు అని గాలింగర్ తన ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









