రష్యా పర్యటన చేస్తున్నసౌదీ రాజు
- October 06, 2017
సౌదీఅరేబియా: మొట్టమొదటిసారిగా రాజు సల్మాన్ రష్యాలో తన అధికారిక పర్యటన చేస్తున్నారు. సిరియా విషయంలో సౌదీ, రష్యా మధ్య అసమ్మతి నెలకొన్న నేపథ్యంలో తొలిసారిగా ఇరుదేశాధినేత నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సాల్మాన్ సమావేశమవనున్నారు. ఈ సమావేశంలో అతిముఖ్యమైన రక్షణ, శక్తి రంగాల ఒప్పందాలపై చర్చించనున్నారు. ఆయిల్ మార్కెట్లో కీలకమైన ఈ రెండు దేశాలు సిరియా యుద్ధ సమయంలో విరుద్ధవైఖరిని ప్రదర్శించాయి. బషర్ అల్ అసాద్‌ను రష్యా సమర్థించగా వ్యతిరేక వర్గానికి సౌదీ మద్ధతు తెలిపింది. దీంతో ఇరుదేశాల సంబంధాల విషయంలో సందిగ్ధత నెలకొంది. 2014 నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనితో ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో సౌదీ రాజు సల్మాన్.. రష్యా పర్యటన చరిత్రాత్మకం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









