పాకిస్తానీ ఇంజినీర్ ను కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డు

- October 06, 2017 , by Maagulf
పాకిస్తానీ ఇంజినీర్ ను కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డు

దుబాయ్: పరాయి దేశంలో జీవిస్తున్నప్పుడు ఒకే దేశం వారు ఐక్యంగా ఉండటం సహజం. కానీ స్వదేశంకు చెందిన వ్యక్తిని డబ్బు కోసం కిడ్నప్ చేసిన ఉదంతం ఇది.  జూన్ 20 న అల్ క్కుసైస్ లో జరిగిన సంఘటనలో 52 ఏళ్ల పాకిస్థానీ వ్యాపారి తన దేశానికి చెందిన ఇంజినీర్ స్నేహితుడిని బలవంతంగా అపహరించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని  అజ్మాన్ కు తీసుకెళ్లాక, కిడ్నప్ నుంచి విడిచిపెట్టాలంటే 5,400 ధిర్హాంలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పాకిస్తాన్ ఇంజినీర్ కోర్టు లో మాట్లాడుతూ, "నేను మెట్రో స్టేషన్ వద్ద నుంచొని ఉన్నప్పుడు ఒక బస్సు వచ్చి నా ముందు ఆగింది కొంతమంది వ్యక్తులు  మధ్యాహ్నం 2:30 గంటలకు ఒక్కసారిగా  నాపై  దాడి చేసి బలవంతాన బస్సులోకి ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని " తెలిపాడు "వారు అజ్మాన్ లోని ఒక ఏకాంత ప్రదేశానికి నన్ను విడిచిపెట్టారు, అక్కడ వారు నాతో 5,400 ధిర్హాంలు  చెల్లించమని ఆదేశాలు ఇచ్చారు, ఎవరినైనా పిలిపించి ఆ సొమ్ము మాకు ఇవ్వాలని బెదిరించారు. దానితో నేను  నా స్నేహితుడిని పిలిపించి ఆ డబ్బు వారికి ఇప్పించానని పేర్కొన్నాడు ఒక పోలీసు లెఫ్టినెంట్ మాట్లాడుతూ, "బాధితుడైన ఇంజినీర్ ముఖంపై  పిడి గుద్దులు కురిపించినట్లు ఆనవాళ్లు  తలపై గాయాలు మరియు శరీరంపై కత్తితో గీసినట్లు చారలు కలిగి ఉన్నాడు,ఈ కేసుకి సంబంధించిన విచారణ అక్టోబర్ 26 వ తేదీకి వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com