మహానుభావుడు' హిట్ తో ఆనందం లో డైరెక్టర్ మారుతి
- October 07, 2017
'మహానుభావుడు' చిత్రం తర్వాత తనకు తెలియని వాళ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని దర్శకుడు మారుతి అన్నారు. శర్వానంద్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'మహానుభావుడు'. మెహరీన్ కథానాయికగా నటించారు. చిత్రంలో అతి శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే ఆనంద్ పాత్రలో శర్వా ఇట్టే ఒదిగిపోయారు. మంచి కథతో ప్రేక్షకులకు వినోదం పంచారని విమర్శకులు యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మారుతి మాట్లాడారు. ''మహానుభావుడు' సినిమా నా బాధ్యత పెంచింది. ఇంత వరకూ యూత్‌ఫుల్, ప్రేమకథలు చేసుకుంటూ వచ్చా. వాటితో పోల్చితే 'మహానుభావుడు' ప్రత్యేకం. ఈ సినిమా బాగుందని, ఇలాంటి చిత్రాలనే తీయమని.. తెలియని వారు ఫోన్లు చేసి చెబుతున్నారు. మారుతి అంటే మంచి ఎంటర్‌టైనర్ అనే మార్కు పండింది. ఆ దిశలో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నా.
కొత్త కోణంలో సినిమాలు తీస్తూ.. ప్రేక్షకుల్ని అలరిస్తా. ఒకే పరిధిలో ఉండిపోను.' 'నేను కథ రాసేటప్పుడే హీరోను అనుకుని రాస్తాను. శర్వానంద్‌ను వూహించుకుని 'మహానుభావుడు' కథ రాశాను కాబట్టి, అతడికి ఆ పాత్ర బాగా సరిపోయింది.' 'నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నా.
నవంబరులో షూటింగ్ ప్రారంభం అవుతుంది. బన్నితో కూడా ఓ సినిమా తీయడానికి కథ సిద్ధం చేస్తున్నా. సీక్వెల్స్, రీమేక్స్ నాకు నచ్చవు. నాకు నచ్చినట్లు కథలు సిద్ధం చేసుకుని, సినిమా తీయడానికి ఇష్టపడుతా.
నా సినిమా చూడగానే ఇది మారుతి సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగాలి. అలా అనిపించినప్పుడే నాకు గుర్తింపు వస్తుంది, అలాంటి సినిమాలే చేస్తా. ఓ ప్రేక్షకుడి పాత్రలోకి వెళ్లి నా సినిమాల్ని తెరకెక్కిస్తుంటా. నాకు పెద్ద స్టార్, చిన్న స్టార్ అనే భేదం ఏమీ లేదు.
అందరితోనూ సినిమాలు చేయడానికి ఇష్టపడుతా.' 'నా సొంత నిర్మాణ సంస్థ మారుతి టాకీస్‌పై మూడు సినిమాలు తీస్తున్నాం. 'లండన్ బాబులు' అనే సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నవంబరులో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మిగిలిన రెండు చిత్రాలు తీయాల్సి ఉంది.' అని మారుతి చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







