' ఫోర్బ్స్' లిస్టులో పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ
- October 07, 2017
యోగాగురు బాబా రాందేవ్ సన్నిహితుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ ఈ సారి మరింత సంపదతో ఇంకా బిలియనీర్ అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ధనవంతులైన (భారత్ లో)వారి పేర్లతో కూడిన లిస్టులో ఈ ఏడాది ఈయన 19 వ స్థానానికి చేరుకున్నాడు. గత సంవత్సరం 45 వ ప్లేస్ లో ఉన్న ఆచార్య బాలకృష్ణ 43 వేల కోట్ల సంపదతో ఈ ఏడాది 19 వ స్థానానికి జంప్ కావడం విశేషం. (యాన్యువల్ ఇండియా రిచ్-2017 పేరిట ఈ మ్యాగజైన్ ప్రతి ఏడాదీ మన దేశంలోని బిలియనీర్ల జాబితాను ప్రచురిస్తోంది).
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేష్ అంబానీ ఎప్పటిలాగే ఈ సారీ 10 వ స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన రూ.2.48 లక్షల కోట్లు. ఆ తర్వాత విప్రో అధినేత ఆజం ప్రేమ్ జీ (రూ.1,24,051 కోట్లు), హిందూజా బ్రదర్స్ ( 1,20,133 కోట్లు), లక్ష్మీ మిట్టల్ (1,07,728 కోట్లు), పల్లోంజీ మిస్త్రీ (1,04,464 కోట్లు) సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ (79 వేల కోట్లు) ఆక్రమించగా అనిల్ అంబానీ 45 వ స్థానానికి దిగజారారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







