13న దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్
- October 07, 2017
ఢిల్లీ: ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. పెట్రో డీలర్లు 13న దేశవ్యాప్తంగా పెట్రో బంక్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 54 వేల బంక్ లు మూతపడనున్నట్లు సమాచారం. ఈ బంద్ కు నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించినట్లు పెట్రో డీలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోక పోవటాన్ని వీరు తప్పుబట్టారు. రోజువారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామన్న పెట్రోలియం శాఖ ఇప్పటికే విధివిధానాలను సైతం రూపొందించ లేదని ఆరోపించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే.. ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా బంకులు బంద్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







