ఆరోగ్యానికి గ్రీన్ టీ...

- April 29, 2015 , by Maagulf
ఆరోగ్యానికి గ్రీన్ టీ...

లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేదాకా మాత్రం అవకాశం ఉన్నా సరే..కప్పుల కొద్దీ కాఫీ తాగడం కన్నా గ్రీన్ టీని ఎంచుకుంటే కెలొరీల సమస్య తగ్గడమే కాదు...ఇతర లాభాలూ పొందవచ్చు.

  • గ్రీన్ టీ కాన్సర్ ప్రమాదాన్ని చాలామటుకు తగ్గిస్తుంది. జపాన్ లో షుమారు అయిదు వందల మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రొమ్ము కాన్సర్ తో పాటు ఊపిరితిత్తుల కాన్సర్ తీవ్రతను తగ్గించే శక్తీ ఈ టీకి ఉంది. రోజూ రెండు కప్పులు అలవాటుగా తీసుకుంటే అందులోని సుగుణాలు కాన్సర్ కణాలను నశింపచేస్తాయని నిపుణులు అంటున్నారు.
  • ఈ టీ కొలెస్ట్రాల్ ను సులువుగా తగ్గిస్తుంది. దాంతో గుండె సమస్యలు అదుపులో ఉంటాయి. కొన్నేళ్ళపాటు నిర్వహించిన ఓ అధ్యయనంలో రోజుకు అయిదు కప్పుల చొప్పున గ్రీన్ టీ తీసుకునే వారిలో గుండెజబ్బుల వల్ల మరణించే పరిస్థితి దాదాపు ఇరవై శాతం తగ్గిందని పేర్కొన్నారు అధ్యయనకర్తలు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అందుకు కారణమని వెల్లడించారు.
  • రోజూ గ్రీన్ టీని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి అధిక బరువు తగ్గడంతో పాటూ భవిష్యత్తులో మధుమేహం, ఇతర సమస్యలు కూడా కొంతవరకు రాకుండా నియంత్రించవచ్చు.
  • ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతి కప్పూ తాగినప్పుడల్లా చిగుళ్ళు ఆరోగ్యంగా మారుతూ ఉంటాయి. గ్రీన్ టీ లో ఉండే ఫ్లోరైడ్ దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పుదీనాతో కలిపి తీసుకుంటే దీని సుగుణాలు రెట్టింపు అవుతాయి. తాగేప్పుడు తాజా పరిమళం కూడా ఉంటుంది.
  • అదే పనిగా తుమ్ములు, దగ్గు లేదా దద్దుర్లు, కళ్ళ వెంట నీరు కారడం.. వంటివన్నీ అలేర్జీకి సంకేతం. ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటే కొన్నాళ్ళు గ్రీన్ టీని తీసుకొని చూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • వయసుతో పాటు వచ్చే సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. దీనిని నివారించాలంటే నిత్యం గ్రీన్ టీని తాగాలంటున్నరు నిపుణులు. కారణం ఈ టీ జీర్ణమయ్యే క్రమంలో కొన్ని ఎంజైముల్ని విడుదల చేస్తుంది. అవి వ్యాధిని నివారిచడంలో సహకరిస్తాయి.

                                                           --- హరిత, కాలిఫోర్నియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com